సెన్సార్ పూర్తి చేసుకున్న “మంచి రోజులు వచ్చాయి”..!

Published on Oct 27, 2021 7:22 pm IST

యంగ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా, మెహ్రీన్‌ జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “మంచి రోజులు వచ్చాయి”. వి.సెల్యులాయిడ్, ఎస్.కె.ఎన్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదిన రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియోలు సినిమాపై మరింత అంచనాలను పెంచాయి.

అయితే రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా సెన్సార్‌ను కూడా కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికేట్ లభించింది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More