ప్రభాస్ ఫ్యాన్స్ కోరిక మేరకు భీమవరంలో ‘మంచి రోజులు వచ్చాయి’ సినిమాకు స్పెషల్ ప్రీమియర్స్..!

Published on Nov 2, 2021 3:04 am IST

యంగ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా, మెహ్రీన్‌ జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “మంచి రోజులు వచ్చాయి”. వి.సెల్యులాయిడ్, ఎస్.కె.ఎన్ బ్యానర్‌లో రూపుదిద్దుకున్న ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదిన రిలీజ్ కాబోతుంది. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్‌కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్స్‌పై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.

ఇప్పటికే వైజాగ్, ఏలూరు, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు తదితర నగరాల్లో పెయిడ్ ప్రీమియర్ ఏర్పాటు చేశారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్‌టో భీమవరంలో కూడా షో వేస్తున్నారు. ఈ స్పెషల్ ప్రీమియర్ బుకింగ్ ఓపెన్ అయిన వెంటనే టికెట్స్ అన్నీ అయిపోయాయి. మిగిలిన చోట్ల కూడా పెయిడ్ ప్రీమియర్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. వీటితో పాటు హైదరాబాద్, కడపలో కూడా ఎక్స్ ట్రా షోలు వేస్తున్నారు. హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్‌లో స్క్రీన్స్ పెంచే అవకాశం కూడా కనిపిస్తోంది. కేవలం ప్రీమియర్స్ తోనే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.

అయితే సందేశం, వినోదం కలిపి ఇవ్వడంలో దర్శకుడు మారుతి ఆరితేరిపోయారు. దానికి తోడు మహానుభావుడు లాంటి సూపర్ హిట్ తర్వాత మారుతి కాంబినేషన్‌లో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను వి సెల్యులాయిడ్ శ్ఖ్ణ్ నిర్మిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన కంటెంట్ కి సూపర్ రెస్పాన్స్ రావడంతో పాటు బుకింగ్స్ కు కూడా అద్భుతమైన స్పందన వస్తుంది. దీంతో భారీ అంచనాల మధ్య దీపావళికి మంచి రోజులు వచ్చాయి సినిమా విడుదలవుతుంది.

సంబంధిత సమాచారం :

More