మారుతి సినిమా అంటే నవ్వులు గ్యారెంటీ – గోపీచంద్

మారుతి సినిమా అంటే నవ్వులు గ్యారెంటీ – గోపీచంద్

Published on Oct 31, 2021 12:32 AM IST


యంగ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా, మెహ్రీన్‌ జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “మంచి రోజులు వచ్చాయి”. వి.సెల్యులాయిడ్, ఎస్.కె.ఎన్ బ్యానర్‌లో రూపుదిద్దుకున్న ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదిన రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి యాక్షన్ హీరో గోపీచంద్, అల్లు అరవింద్ గారు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు.

హీరో గోపీచంద్ మాట్లాడుతూ మారుతి సినిమా అంటే నవ్వులు గ్యారెంటీ అని అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నానంటే అది నేను ఎక్స్పీరియన్స్ చేశానని, నవంబర్ 4న సినిమా చూస్తే అది మీకు అర్థమవుతుందని అన్నారు. సినిమా అంతా పగలబడి నవ్వడం ఖాయమని, మంచి రోజులు వచ్చాయి పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.

హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ “కేవలం నా టాలెంట్ నమ్మి మళ్లీ మళ్లీ నాకు అవకాశాలు ఇస్తున్న యు.వి.కాన్సెప్ట్స్ కు జీవితాంతం రుణపడి ఉంటానని, ఈ స్టేజ్ ఎక్కడానికి ఎంతో కష్టపడ్డాను. మంచి రోజులు వచ్చాయి ఖచ్చితంగా అందరినీ అలరిస్తోంది. నవంబర్ 4న థియేటర్స్ అన్నీ నవ్వులతో నిండిపోవాలి అని అన్నారు.

దర్శకుడు మారుతి మాట్లాడుతూ కరోనా తర్వాత అందరు తెలియకుండానే ఒక భయంలోకి వెళ్లిపోతున్నారు. ఆ భయం మీద ఎందుకు సినిమా చేయకూడదు అనే ఐడియా నాకు వచ్చింది. అది వచ్చిన వెంటనే 20 రోజుల్లో కథ రాసి 30 రోజుల్లో సినిమా తీశాను. ముందు నా పేరు వేసుకోకూడదు అనుకున్నాను. కానీ ఒక మంచి విషయం చెబుతున్నప్పుడు దాని ఫలితం కూడా మనమే తీసుకోవాలని అల్లు అరవింద్ గారితో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నాను. సాధారణంగా ఒక పెద్ద సినిమా చేస్తున్నప్పుడు చిన్న సినిమా చేయాలి అంటే నిర్మాతలు ఒప్పుకోరు. ఈ సినిమా సరదాగా చేసినా సీరియస్ విషయం ఉంది. ఖచ్చితంగా నవంబర్ 4న థియేటర్లలో మీరు ఈ సినిమా చూసి బాగా నవ్వుతారని, ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నానని అన్నారు.

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ సినిమా వాళ్లకు మంచి రోజులు రావడం అంటే జనం థియేటర్స్ కు వచ్చి ఆశీర్వదించడం. ఈ మధ్య విడుదలైన రెండు మూడు సినిమాలకు అలాంటి మంచి రోజులు చూపించారు. నేను ఓటిటి ఓనర్ అయ్యుండి కూడా సినిమాను తెరమీదే చూడండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. మారుతి నాకు బన్నీ స్నేహితుడిగా తెలుసని, మా ఇంట్లో కుర్రాడి కింద చూస్తాం. ఎంటర్టైన్మెంట్ లోనే సందేశం ఇచ్చే దర్శకుడు మారుతి. శోభన్ నీ గురించి పేపర్ బాయ్ ఈవెంట్ లోనే చెప్పాను. నువ్వు గీతా ఆర్ట్స్ లో సినిమా చేయాలి. నీకు చాలా టాలెంట్ ఉంది. మెహరీన్ నువ్వు స్వీట్ హార్ట్. స్టార్ హీరోలు ముందుకొచ్చి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నారు. అది చాలా మంచి సంప్రదాయం. ఇప్పుడు ఇండస్ట్రీకి చాలా అవసరం. మంచి రోజులు మనకు ముందున్నాయని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు