ట్రోల్స్‌పై మంచు ఫ్యామిలీ సీరియస్.. భారీగా పరువు నష్టం..!

Published on Feb 19, 2022 9:00 pm IST

టాలీవుడ్ యాక్షన్ కింగ్ మంచు మోహన్‌బాబు ఫ్యామిలీపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ సమస్యలు, సన్నాఫ్ ఇండియా మూవీ అడ్వాన్స్ బుకింగ్స్, కలెక్షన్లపై ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచు విష్ణుకు చెందిన నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ తరఫున శేషు కుమార్ అనే వ్యక్తి ట్రోలర్స్‌ని హెచ్చరిస్తూ ఓ లేఖని విడుదల చేశారు.

మంచు ఫ్యామిలీపై వస్తున్న ట్రోల్స్‌ను తక్షణమే తొలగించకపోతే చర్యలు తీసుకుంటామని, రూ. 10 కోట్లు పరువు నష్టం దావా వేస్తామని శేషుకుమార్ వెల్లడించారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌ వంటి సోషల్‌ మీడియా వేదికల్లో మంచు ఫ్యామిలీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తొలగించాలని అన్నారు.

సంబంధిత సమాచారం :