“పుష్ప ది రైజ్” పై మంచు లక్ష్మీ కీలక వ్యాఖ్యలు!

Published on Jan 9, 2022 3:30 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప ది రైజ్. ఈ చిత్రం చూసిన మంచు లక్ష్మీ తాజాగా సోషల్ మీడియా వేదిక గా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. పుష్ప చాలా ఫెంటాస్టిక్ గా ఉందని పేర్కొనడం జరిగింది. అల్లు అర్జున్ కి హ్యాట్సాఫ్ అంటూ చెప్పుకొచ్చింది. పుష్పరాజ్ లాంటి పాత్రను చేయడానికి చాలా కష్టం అని, అల్లు అర్జున్ చేసిన విధానం బాగుంది అని అన్నారు. మీ డెడికేషన్ మరియు లవ్ కారణం గా ఇంత బాగా వచ్చింది అంటూ పేర్కొనడం జరిగింది.

అంతేకాక ప్రతి సన్నివేశాన్ని బాగా ఎంజాయ్ చేసినట్లు పేర్కొన్నారు. పుష్ప 2 కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. సమంత, రష్మీక మందన్న, డైరెక్టర్ సుకుమార్ ల పై ప్రశంసల వర్షం కురిపించారు. మంచు లక్ష్మి చేసిన వ్యాఖ్యల పట్ల అల్లు అర్జున్ స్పందిస్తూ, థాంక్స్ తెలిపారు.

సంబంధిత సమాచారం :