ప్రపంచంలోని ప్రతి ప్రతిష్టాత్మక అవార్డు ను పొందండి – మంచు లక్ష్మి

Published on Oct 26, 2021 11:09 pm IST

కేవలం తమిళ నాట మాత్రమే కాకుండా, యావత్ భారతావని సూపర్ స్టార్ అని పిలిచే హీరో రజినీకాంత్ అని చెప్పాలి. రజినీకాంత్ కి కేవలం భారత్ లో మాత్రమే కాకుండా విదేశాల్లో సైతం భారీగా అభిమానులు ఉన్నారు. సినిమాల్లో రజినీకాంత్ గత 40 ఏళ్లుగా కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. రజినీకాంత్ సినీ రంగం లో చేస్తున్న సేవలకు గానూ, కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ను అందజేయడం జరిగింది.

ఈ మేరకు టాలీవుడ్ నుండి కూడా పలువురు ప్రముఖులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంచు ఫ్యామిలీ కి చెందిన మంచు లక్ష్మి సూపర్ స్టార్ రజినీకాంత్ కి అవార్డ్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిన్నప్పటి నుండి మిమ్మల్ని చూస్తున్నాను అని అన్నారు. సూపర్ స్టార్ అంకుల్ గా చూస్తున్నా అని అన్నారు. అందరికీ ప్రేరణ గా ఎంతో ఎత్తులో ఉన్నారు అని, మీరు గొప్ప నటుడు, గొప్ప మనిషి అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక ప్రపంచం లోని ప్రతి ప్రతిష్టాత్మక అవార్డు ను పొందండి అని వ్యాఖ్యానించారు.

సంబంధిత సమాచారం :

More