మంచు లక్ష్మీతో తరుణ్ భాస్కర్ వెబ్ సిరీస్

Manchu tarun

మోహన్ బాబు తనయ మంచు లక్ష్మీ నటిగా, వ్యాఖ్యాతగా, నిర్మాతగా పలు రంగాలలో రాణిస్తున్నారు. కాగా తాజా ఓ వెబ్ సిరీస్ లో నటిస్తుండగా దానికి దర్శకుడు పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కావడం విశేషం. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ సారథి స్టూడియోస్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. పూర్తిగా రాజకీయ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతుందట. ఈ వెబ్ సిరీస్ ఎప్పుడో కార్యరూపం దాల్చాల్సివుండగా తరుణ్ భాస్కర్ తండ్రి హఠాత్ మరణంతో వాయిదా పడింది. అలా ఈ వెబ్ సిరీస్ ఆలస్యం అయ్యింది.

ఈ వెబ్ సిరీస్ మంచు లక్ష్మీ స్వయంగా నిర్మిస్తున్నారు. నేను మీకు తెలుసా, ఝమ్మంది నాదం, ఊకొడతారా ఉలిక్కిపడతారా, దొంగాట,గుండెల్లో గోదావరి అనే చిత్రాలు నిర్మించారు. ఐతే వీటిలో ఒక్క చిత్రం కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. మరి ఈ వెబ్ సిరీస్ తో నైనా హిట్ కొడతారేమో చూడాలి. ఇక దర్శకుడు తరుణ్ భాస్కర్ మీకు మాత్రమేచెప్తా చిత్రంతో పూర్తి స్థాయి హీరోగా మారాడు. హీరోగా ఈ చిత్రంలో నటనకు తరుణ్ కి మంచి మార్కులే పడ్డాయి.

Exit mobile version