నెటిజన్ల పై మంచు లక్ష్మి సీరియస్ !

Published on Oct 17, 2021 9:33 pm IST

మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు నెటిజన్లకు తనదైన శైలిలో సమాధానాలు చెబుతూ ఉంటుంది లక్ష్మి. అయితే, తాజాగా కొంతమంది నెటిజన్ల పై మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. కారణం.. విష్ణు.. ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు.. మంచు లక్ష్మి ఒక ట్వీట్ పెట్టింది. ‘నా బ్రదర్ విష్ణు.. ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు ఇది. ప్రపంచాన్ని మార్చడానికి ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభించనున్న కొత్త ప్రయాణానికి ఆల్‌ ది బెస్ట్‌’ అంటూ ఆమె ట్వీట్‌ చేశారు.

ఐతే, మంచు లక్ష్మి ట్వీట్‌ పై నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ చేస్తూ.. ‘‘మా’ అధ్యక్షుడు మొత్తం ప్రపంచాన్ని ఎలా మార్చగలడు?’’ అంటూ మెసేజ్ లు చేశారు. తాజాగా ఆ మెసేజ్ లకు మంచు లక్ష్మి రియాక్ట్ అవుతూ.. ‘ఇక ఆపండి. ఎప్పుడు ఎవర్ని కామెంట్‌ చేద్దామా అని చూస్తుంటారు. నటీనటులకు సినిమానే ఓ ప్రపంచం. నా ఉద్దేశం మా అసోసియేషన్‌ అనే ప్రపంచాన్ని మార్చడం. ఈ విషయాన్ని కొంచెం అర్థం చేసుకోండి’ అంటూ ఆమె మెసేజ్ చేశారు.

సంబంధిత సమాచారం :