నాకెలాంటి ప్రమాదం జరగలేదు – మంచు లక్ష్మి

Published on Dec 19, 2021 10:25 pm IST

మంచు లక్ష్మికి గాయాలు అయ్యాయని వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా ఆమె తన ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్ట్‌ చేసిన గాయాల ఫొటోల పై క్లారిటీ ఇచ్చారు. తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు. మరి ఆ గాయాలకు సంబంధించిన ఫోటోలు ఏమిటంటే.. మంచు లక్ష్మి ఇటీవల ఓ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ సినిమా షూటింగ్ తాలూకు ఫోటోలనే ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ షేర్‌ చేశారు.

అయితే, ఆ ఫోటోల్లో మంచు లక్ష్మి చేతికి, మోకాలికి గాయాలు అయినట్లు కనిపించాయి. దాంతో మంచు లక్ష్మికి ప్రమాదం జరిగిందని ఆమె అభిమానులు కలత చెందారు. మంచు లక్ష్మికి ఏమైందోనని ఆరా తీస్తూ మెసేజ్ లు పోస్ట్ చేశారు. ఈ క్రమంలో మంచు లక్ష్మి క్లారిటీ ఇస్తూ.. ‘ఆ ఫొటోలు సినిమా షూటింగ్ కి సంబంధించినవి. నాకెలాంటి ప్రమాదం జరగలేదు’ అని ఆమె చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :