వైరల్: డీజే టిల్లుతో కలిసి మాస్ డ్యాన్స్ చేసిన మంచు లక్షీ..!

Published on Feb 24, 2022 10:43 pm IST

సీనియర్ నటుడు మోహన్‌బాబు కుమార్తె, నటి, నిర్మాత మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందనేది మనందరికీ తెలిసిందే. ప్రొపెషనల్, పర్సనల్‌గా అనేక విషయాలను అభిమానులతో పంచుకోవడమే కాకుండా, అప్పుడప్పుడు ఫన్నీ వీడియోలు, డ్యాన్సులతో కూడా అలరిస్తూ ఉంటుంది. అయితే తాజాగా మంచు లక్షీ డీజే టిల్లుతో కలిసి చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

హీరో సిద్దూ జొన్నలగడ్డ, అమన్‌లతో కలిసి డీజే టిల్లు సినిమాలోని మాస్‌ సాంగ్‌ “టిల్లు అన్నా డీజే పెడితే.. అంటూ సాగే పాటకి చేరకట్టులోనే సింపుల్‌గా ఊరమాస్ స్టెప్పులేసి అలరించింది. ఈ వీడియోను మంచు లక్ష్మీ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది.

సంబంధిత సమాచారం :