పవన్, విష్ణు ఎడమొహం పెడమొహంగా లేరు – మంచు లక్ష్మి

Published on Oct 18, 2021 11:00 am IST

‘మా’ అధ్యక్షడిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత మంచు విష్ణు తన అక్క మంచు లక్ష్మితో పాటు తన ప్యానల్ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ – విష్ణు ఎడమొహం పెడమొహంగా కూర్చున్నారని వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం పై మంచు లక్ష్మి, ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ‘బండారు దత్తాత్రేయ గారి అలయ్ బలయ్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ తో పాటు విష్ణు కూడా వెళ్ళాడు. అయితే, బయట ప్రచారం జరుగుతున్నట్లు.. పవన్ కళ్యాణ్, విష్ణు ఎడమొహం పెడమొహంగా లేరు. కెమెరా కి వెనుక ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు. ఈ విషయం తెలియక ఒక ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో కొంతమంది నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు’ అంటూ మంచు లక్ష్మి తెలిపారు.

సంబంధిత సమాచారం :