రెండేళ్లు తప్పించుకున్నా కరోనా బారిన పడక తప్పలేదు – మంచు లక్ష్మీ

Published on Jan 6, 2022 8:32 pm IST


సీనియర్ నటుడు మోహన్‌బాబు కుమార్తె, నటి, నిర్మాత మంచు లక్ష్మీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమే సోషల్‌ మీడియా వేదికగా తెలియచేశారు. బూచోడులాంటి కరోనా నుంచి రెండేళ్లుగా తప్పించుకున్నానని, కానీ చివరికి దాని బారిన పడక తప్పలేదని అన్నారు. కరోనా నుంచి త్వరగా కోలుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పింది.

అయితే ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్‌ ధరించండని, వాక్సిన్‌ తీసుకోవడం మర్చిపోవద్దు. ఒకవేళ మీరు ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని ఉంటే బూస్టర్‌ డోస్ కూడా తీసుకునేందుకు ప్రయత్నించండని విజ్ఞప్తి చేశారు. ఇక ఇంట్లోనే ఉన్న తనకోసం మంచి సినిమాలు, షోలు, పాడ్‌కాస్ట్‌లు ఉంటే చెప్పండంటూ మంచు లక్ష్మీ అభిమానులను కోరింది.

సంబంధిత సమాచారం :