పదేళ్లు పూర్తి చేసుకున్న మిష్టర్ నోకియా…మంచు మనోజ్ ఏమోషనల్ పోస్ట్!

Published on Mar 8, 2022 11:50 pm IST


మంచు మనోజ్ హీరోగా అనిల్ కన్నెగంటి దర్శకత్వం లో వచ్చిన చిత్రం మిష్టర్ నోకియా. ఈ చిత్రం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు పెట్టిన పోస్ట్ కి గానూ, హీరో మంచు మనోజ్ ఏమోషనల్ అయ్యారు. ఈ మేరకు చిత్రం గురంచి ప్రస్తావిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ చిత్రం ఎప్పటికీ కూడా నా హృదయం లో ప్రత్యేక స్థానం ను కలిగి ఉంటుంది అని తెలిపారు. ఈ చిత్రం పట్ల వచ్చిన అభినందనలు, ప్రేమను ఎప్పటికీ మరువలేను అని అన్నారు. దర్శకుడు అనీల్ కన్నెగంటి గారు, DOP రాజశేఖర్ గారు, మై డార్లింగ్ రాక్ స్టార్ యువన్ శంకర్ రాజా కి థాంక్స్ తెలిపారు. అంతేకాక డియర్ బ్రదర్, సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి గారికి ఓకే ఒక జీవితం సాంగ్ ఎవర్ గ్రీన్ లిరిక్స్ అందించినందుకు స్పెషల్ థాంక్స్ తెలిపారు. మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం :