గుంటూరు బ్యాక్ డ్రాప్ లో ‘మంచు మనోజ్’ సినిమా !

Manchu-Manoj
శౌర్య, అటాక్ వంటి పరాజయాలతో డీలాపడ్డ యంగ్ హీరో ‘మంచు మనోజ్’ తాజాగా ‘నా రాకుమారుడు’ ఫెమ్ ‘ఎస్.కే. సత్య’ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్ర షూటింగ్ త్వరలో హైదరాబాద్ లో మొదలుకానుంది. వీలైనంతవరకూ ప్రయోగాలు చేస్తూ తన పాత్రల్లో వైవిధ్యం చూపాలని ప్రయత్నించే మనోజ్ ఈ సినిమాలో లవర్ బాయ్ పాత్రలో కనిపించనున్నాడు.

ఈ చిత్రం చాలా వరకు గుంటూరు బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని, హైదరాబాద్ షూటింగ్ షెడ్యూల్ పూర్తవగానే యూనిట్ గుంటూరు వెళుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మనోజ్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరనేది ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ‘వరుణ్ అట్లూరి’ నిర్మించనుండగా ‘శ్రీ వసంత్’ సంగీతాన్ని సమాకూర్చనున్నాడు.