రెండో పెళ్లిపై మంచు మనోజ్ భలే క్లారిటీ ఇచ్చాడుగా..!

Published on Oct 27, 2021 5:02 pm IST

హీరో మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. 2015లో హైదరాబాద్‌కు చెందిన ప్రణతీరెడ్డిని మంచు మనోజ్ వివాహం చేసుకున్నాడు. వ్యక్తిగత జీవితంలో మనస్పర్థలు రావడంతో 2019లో వారిద్దరు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి మనోజ్ రెండో పెళ్లి చేసుకోనున్నాడన్న వార్తలు వినబడుతూనే ఉన్నాయి.

అయితే మంచు మనోజ్ ఓ విదేశీ యువతిని పెళ్లి చేసుకోబోతున్నాడని, కుటుంబసభ్యులు కూడా పెళ్లి ఏర్పాట్లలో ఉన్నారని ఈ మధ్య గట్టిగానే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై మంచు మనోజ్‌ భలేగా క్లారిటీ ఇచ్చాడు. దయచేసి నన్ను కూడా పెళ్లికి పిలవండని, ఇంతకీ పెళ్లి ఎక్కడ చేస్తున్నారు? ఆ బుజ్జి, తెల్ల పిల్ల ఎవరు అంటూ మీ ఇష్టం రా అంతా మీ ఇష్టం అని ట్వీట్ చేశాడు. దీంతో మనోజ్ రెండో పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టత వచ్చేసింది.

సంబంధిత సమాచారం :

More