పిక్ అదిరింది అన్న…సునీల్ ఫోటో పై మంచు మనోజ్ కామెంట్స్

Published on Oct 26, 2021 2:00 pm IST

టాలీవుడ్ లో కమెడియన్ గా ఉంటూనే, హీరో పాత్రలు చేశారు సునీల్. సునీల్ ఇప్పుడు కమెడియన్ పాత్రలు మాత్రమే కాకుండా, సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను, అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. తాజాగా సోషల్ మీడియా లో సునీల్ బ్లాక్ అండ్ వైట్ లో ఒక ఫోటో ను షేర్ చేయడం జరిగింది. సమస్యలను కాకుండా, అవకాశాలను చూడండి అంటూ సునీల్ ఫోటో కి క్యాప్షన్ ఇవ్వడం జరిగింది.

సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో పై నెటిజన్లు లైక్స్ కొడుతూ షేర్ చేస్తున్నారు. ఈ ఫోటో పై మంచు మనోజ్ స్పందించడం జరిగింది. పిక్ అదిరింది అన్న అంటూ చెప్పుకొచ్చారు. మంచు మనోజ్ సైతం కామెంట్స్ చేయడం తో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ ఫోటో లో సునీల్ స్టైలిష్ గా కనపడుతున్నారు.

సంబంధిత సమాచారం :

More