తారకరత్న ఆరోగ్యం పై మంచు మనోజ్ కామెంట్స్!

Published on Jan 29, 2023 8:32 pm IST

నందమూరి తారకరత్న గుండెపోటు కారణం గా బెంగుళూరు లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. అతనిని చూసేందుకు పలువురు ప్రముఖులు, సినీ పరిశ్రమ కి చెందిన వారు ఆసుపత్రి కి వెళ్తున్నారు. ఈ మేరకు తారకరత్న ను సందర్శించిన మంచు మనోజ్ సోషల్ మీడియా వేదిక గా, తారకరత్న ఆరోగ్యం పై పలు వ్యాఖ్యలు చేశారు.

తారకరత్నను సందర్శించాను. అతని భవిష్యత్తు పట్ల ఆశ మరియు ఆశావాదంతో నిండిపోయాను. అతనికి మన తిరుగులేని మద్దతు ఉంది. దేవుని దయ మరియు అతనిని చూసుకునే ప్రజల ప్రార్థనలతో నేను ఖచ్చితంగా ఉన్నాను. అతను త్వరలో పూర్తిగా కోలుకుని ఇంటికి తిరిగి వస్తాడు. లవ్ యూ బాబాయ్ అంటూ చెప్పుకొచ్చారు. మంచు మనోజ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తారకరత్న త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :