మనదంతా ఒకే కులం అంటూ మనోజ్ ఇంట్రెస్టింగ్ రిప్లై.!

Published on Oct 24, 2021 1:00 pm IST

నిన్న పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “రాధే శ్యామ్” టీజర్ కోసం అంతా ఎంతలా ఆసక్తిగా ఎదురు చూసారో అందరికీ తెలుసు. మరి ఎట్టకేలకు ఇన్నేళ్ల నిరీక్షణకు దర్శకుడు రాధాకృష్ణ తెర దించాడు. దీనితో ప్రముఖ హీరో మంచు మనోజ్ రాధా కి ఈ టీజర్ ని కరుణించి ఇచ్చినందుకు ఫన్నీ ట్వీట్ పెట్టాడు. దీనితో ఈ టీజర్ కోసం ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ లిస్ట్ లో ఒకడిగా మనోజ్ కూడా చేరాడు.

దీనితో ప్రభాస్ అభిమానులు మనోజ్ కూడా మన కులమే అని దీనికి రిలేటెడ్ గా అనగా దానికి మనోజ్ కూడా ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చాడు. “మనదంతా ఒకటే కులం ప్రేమి’కులం’. కలిసే పడతాం కలిసే లేస్తాం” అన్నట్టుగా ఇంట్రెస్టింగ్ రిప్లై ఇవ్వడంతో ఇది కాస్తా ఇపుడు వైరల్ అవుతుంది. మొత్తానికి రాధే శ్యామ్ టీజర్ ఇంత పని చేసింది.

సంబంధిత సమాచారం :