“భీమ్లా నాయక్” పై మంచు వారి హీరో ఇంట్రెస్టింగ్ ట్వీట్!

Published on Feb 25, 2022 2:00 pm IST


ఈరోజు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు నమోదు చెయ్యడానికి వచ్చిన మోస్ట్ అవైటెడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “భీమ్లా నాయక్”. దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మాస్ ఎంటర్టైనర్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఆల్రెడీ నైట్ షోస్ తో మంచి మౌత్ టాక్ కూడా ఈ సినిమాపై మొదలు కాగా ఇండస్ట్రీకి చెందిన అనేక మంది సినీ ప్రముఖులు ఈ చిత్రం పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరి ఈ లిస్ట్ లో ఇప్పుడు మంచు వారి హీరో మంచు మనోజ్ పెట్టిన ట్వీట్ మంచి ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పాలి. ఈ సినిమా హీరోలు పవన్ కళ్యాణ్ మరియు రానాలు తనకి ఫేవరెట్ అని అలాంటి ఈ ఇద్దరు హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తుండడం చాలా ఆనందంగా అనిపిస్తుందని ఆల్రెడీ పాజిటివ్ రెస్పాన్స్ వింటున్నాను మీ ఇద్దరు బిగ్ బ్లాక్ బస్టర్ అందుకోవాలని కోరుకుంటున్నానని మనోజ్ తెలిపాడు. దీనితో ముగ్గురు హీరోల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :