‘భీమ్లా’ సెట్‌లో పవన్ కళ్యాణ్‌తో మంచు మనోజ్ భేటీ..!

Published on Oct 14, 2021 10:00 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో తాజాగా మంచు మనోజ్ భేటీ అయ్యాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ షూటింగ్ స్పాట్‌కి వెళ్లిన మంచు మనోజ్ కీలక అంశాలపై చర్చించారు. స్వతహాగా పవన్ కళ్యాణ్ అంటే మంచు మనోజ్‌కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. మనోజ్ పట్ల కూడా పవన్ కళ్యాణ్ ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు. అయితే వీరిద్దరి భేటీ సుమారు గంటకుపైగా జరగ్గ పలు విషయాలపై చర్చించారు.

అయితే వీరి భేటీలో ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో చోటు చేసుకున్న పరిణామాలతోపాటు, తాజా చిత్రాల ప్రస్తావన కూడా వచ్చినట్టు తెలుస్తుంది. ఇకపోతే ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికలు మెగా ఫ్యామిలీకి, మంచు ఫ్యామిలీకి మధ్య దూరాన్ని పెంచినట్టు వార్తలు వినిపించినా నేడు పవన్ కళ్యాణ్, మనోజ్ భేటీతో అలాంటి గ్యాప్ వీరి ఫ్యామిలీల మధ్య రాలేదని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :