కూతురి పేరును ప్ర‌క‌టించిన మంచు మ‌నోజ్

కూతురి పేరును ప్ర‌క‌టించిన మంచు మ‌నోజ్

Published on Jul 8, 2024 1:36 PM IST

టాలీవుడ్ హీరో మంచు మ‌నోజ్ భార్య‌ మౌనిక ఇటీవ‌ల ఓ ఆడ‌బిడ్డకు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. దీంతో మంచు ఫ్యామిలీలో సంతోషం మ‌రింత పెరిగింది. అయితే, తాజాగా త‌మ కూతురికి నామ‌క‌ర‌ణం చేశారు ఈ యంగ్ హీరో.

త‌న గారాల‌పట్టి అయిన‌ కూతురికి ”దేవ‌సేన శోభా”గా నామ‌క‌ర‌ణం చేసిన‌ట్లు మంచు మనోజ్ తాజాగా ట్వీట్ చేశాడు. సుభ్ర‌హ్మ‌ణ్య స్వామి భార్య పేరైన‌ దేవ‌సేన‌.. అలాగే తన అత్త‌గారు శోభా నాగిరెడ్డి పేరులోని శోభా ను క‌లిపి త‌న కూతురికి ”దేవ‌సేన శోభా” అనే పేరును పెట్టిన‌ట్లుగా మంచు మ‌నోజ్ తెలిపాడు.

త‌న కూతురికి అంద‌రి ఆశీస్సులు ఉండాల‌ని, ఆ ప‌ర‌మశివుడు త‌మ‌పై ఇలాంటి కృప‌ను కొన‌సాగించాల‌ని మంచు మ‌నోజ్ ఈ సంద‌ర్భంగా కోరాడు. ఇక త‌న ఫ్యామిలీతో క‌లిసి దిగిన ఫోటోను ట్విట్ట‌ర్ వేదిక‌గా అభిమానుల‌తో షేర్ చేసుకున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు