తన నిర్మాతలపై దాడిని ఖండించిన ‘మంచు మనోజ్’ !
Published on Aug 2, 2016 5:29 pm IST

Manchu-Manoj
యంగ్ హీరో ‘మంచు మనోజ్’ తాజాగా నటిస్తున్న కొత్త చిత్రం తాలూకు షూటింగ్ గత 20 రోజుల నుండి వైజాగ్ పరిసరాల్లోని పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం అనే గ్రామంలో జరుగుతోంది. దర్శకుడు ‘అశోక్’ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాతలు ‘అచ్చిబాబు, ఎస్ ఎన్ రెడ్డి’లు సంయుక్తంగా నిర్మస్తున్నారు. అసోషియేషన్ రూల్స్ ప్రకారం ఎక్కడ షూటింగ్ జరిపితే అక్కడ లోకల్ మూవీ అసోసియేషన్ కు చెందిన జూనియర్ ఆర్టిస్టులను షూటింగ్ కోసం తీసుకోవాలి. ఆ ప్రకారమే నిర్మాతలు లోకల్ గా ఉండే రాము అనే ఏజెంట్ ద్వారా కొంతమంది జూనియర్ ఆర్టిస్టులను తీసుకున్నారు.

కానీ పేమెంట్ల విషయంలో నిర్మాతలకు, ఏజెంటుకు గొడవలు తలెత్తడంతో ఏజెంట్ కొంతమంది లోకల్ వ్యక్తుల చేత నిర్మాత అచ్చిరెడ్డి పై దాడికి దిగాడని తెలుస్తోంది. వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు హీరో మనోజ్ చర్చలు జరిపినప్పటికీ అవి సఫలం కాలేదు. దీంతో ఇరు పక్షాలు పరవాడ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. ఈ విషయంపై ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించిన మనోజ్ తీవ్రంగా స్పందించారు. తన నిర్మాతలపై దాడి చేయడం న్యాయం కాదని తెలిపి, ఈ వివాదంపై వెంటనే స్పందించాలని ఇండస్ట్రీ పెద్దల్ని కోరాడు.

 
Like us on Facebook