ఓ ఇంటివాడైపోయిన మంచు మనోజ్..!

manchu-marrige

మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ ఓ ఇంటివాడైపోయాడు. నేటితో ఆయన బ్యాచిలర్ జీవితానికి స్వస్తి పలికి ప్రణతి రెడ్డిని పెళ్ళాడి కొత్త జీవితానికి స్వాగతం పలికాడు. హైద్రాబాద్‌లోని హైటెక్స్‌లో ఈ ఉదయం మూడు ముళ్ళ బంధంతో మనోజ్, ప్రణతిలు ఒక్కటయ్యారు. మోహన్ బాబు ఫ్యామిలీలో మనోజ్‌ తరంలో జరుగుతున్న చివరి పెళ్ళి కావడంతో కుటుంబమంతా ఈ వేడుకను మరచిపోలేని రీతిలో నిర్వహించేందుకు ప్లాన్ చేసుకున్నారు.

పెళ్ళికి ఐదు రోజుల ముందు నుంచే నులుగు ఫంక్షన్, సంగీత్ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్ అంటూ ఒక్కో వేడుకను గ్రాండ్‌గా నిర్వహిస్తూ వచ్చిన మంచు ఫ్యామిలీ ఇక అసలైన పెళ్ళి వేడుకను మరింత వైభవంగా చేశారు. అతిథులందరికీ అద్భుతమైన ఏర్పాట్లు చేసి మంచు ఫ్యామిలీ ఆతిథ్యం రుచి చూపారు. ఇక ఈ వేడుక సినీ, రాజకీయ, వాణిజ్య ప్రముఖులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక మంచు మనోజ్ పుట్టిన రోజునే అతడి పెళ్ళి కూడా జరగడం విశేషం.

Exit mobile version