సినిమాలు మానేస్తున్నానంటూ సంచలన ప్రకటన చేసిన మంచు మనోజ్


టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సంచలన ప్రకటన చేశారు. మనోజ్ నుంచి ఇటువంటి ప్రకటనని అటు అభిమానులు కానీ, ఇటు సినీ వర్గాలు కానీ ఊహించలేదు. తాను సినిమాల్లో నటించడం మానేస్తున్నానంటూ మనోజ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. తాను ప్రస్తుతం నటిస్తున్న ఒక్కడు మిగిలాడు, ఆ తరువాత చేయబోయే మరో చిత్రమే తన చివరి సినిమాలు అని ప్రకటించాడు.

మనోజ్ నుంచి వచ్చిన ఈ ప్రకటన అనూహ్యమనే చెప్పాలి. కానీ తాను నటించడం మానేసినా సినిమాలతో అసోసియేట్ అవుతానని మనోజ్ హింట్ ఇచ్చాడు. తాను సినిమాల్లో నటించడం మాత్రమే మానేస్తున్నానని మనోజ్ ప్రకటించడం విశేషం. మనోజ్ కు గత కొంత కాలంగా సరైన విజయం లేదు. ఆ కారణంగా సినిమాల నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నాడా అనే విషయం తెలియాల్సి ఉంది.