‘మహానటి’ లో నటించనున్న మోహన్ బాబు ?


యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘మహానటి’. అనేక విశేషాలున్న అలనాటి నటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా కావడంతో దీనిపై అందరిలోనూ ఆసక్తి ఉంది. ముఖ్యంగా వాస్తవ పాత్రలను పోషించబోయే నటుల విషయంలో అయితే రక రకాల వార్తలు, రూమర్లు పుట్టుకొస్తున్నాయి. రీసెంట్ గా ఇందులో సీనియర్ ఎన్టీఆర్ పాత్రను తారక్ చేస్తాడని వార్తలు రాగా కొద్దిసేపటికే అవి కాస్తా రూమర్లేనని తేలిపోయింది.

ఇప్పుడు తాజాగా సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఎస్వీ రంగారావు గారి నిజ జీవిత పాత్రను చేస్తారని అంటున్నారు. కానీ ఈ వార్త ఎంత వరకు వాస్తవమో పూర్తి స్థాయిలో సమాచారం లేదు. కాబట్టి అధికారిక ప్రకటన వెలువడే వరకు కాస్త వేచి ఉండాల్సిందే. ఇకపోతే సినిమాలో ఇతర ముఖ్యమైన సావిత్రి పాత్రకు కీర్తి సురేష్ ను, జెమినీ గణేశన్ రోల్ కోసం దుల్కర్ సల్మాన్ ను, మరో పాత్ర కోసం సమంతను తీసుకున్న సంగతి తెలిసిందే.