మంచు విష్ణు ‘జిన్నా’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Oct 3, 2022 5:00 pm IST

మంచు విష్ణు కథానాయకుడిగా యువ దర్శకుడు ఈషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ జిన్నా. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్స్ గా కనిపించనున్న ఈ మూవీని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏ వి ఏ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై హీరో విష్ణు స్వయంగా నిర్మించారు. ఇక ఈ మూవీకి కామెడీ సినిమాల దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి స్టోరీ అందించగా కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందించారు.

ఆడియన్స్ లో మొదటి నుండి మంచి అంచనాలు ఏర్పరిచిన జిన్నా మూవీ ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు రిలీజ్ అయిన రెండు సాంగ్స్ శ్రోతలను ఆకట్టుకుని మూవీ పై మరింతగా అంచనాలు పెంచాయి. ఇక ఈ మూవీ అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ ని అక్టోబర్ 5 న దసరా పండుగ కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు కొద్దిసేపటి క్రితం యూనిట్ ప్రకటించింది. అన్ని వర్గాల ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే విధంగా తెరకెక్కిన జిన్నా మూవీ తప్పకుండా రిలీజ్ తరువాత మంచి విజయం అందుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కాగా ఈ మూవీని అక్టోబర్ 21 న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :