ప్రతీ ఓటును పరిగణనలోకి తీసుకోండి – మంచు విష్ణు!

Published on Oct 10, 2021 2:49 pm IST


మా ఎలక్షన్స్ నేడు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మంచు విష్ణు మరియు ప్రకాష్ రాజ్ లు మా అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కు ను వినియోగించేందుకు సిద్దం అయ్యారు. ఇప్పటికే మా ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా ఓట్లు పోల్ అయ్యాయి అని పలువురు చెబుతున్నారు.

ఈ మేరకు సోషల్ మీడియా వేదిక గా మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా బంధువులందరికీ అంటూ చెప్పుకొచ్చారు, ఓటు వేయడానికి ఎన్నికల అధికారి సమయం ఇస్తున్నారు అని తెలిపారు. ట్రాఫిక్ జామ్ కారణం గా మేము అర్థం చేసుకుంటున్నాము, చాలా మంది ఓటు వేయడానికి రాలేదు, దయచేసి వీలైన త్వరగా ఓటు వేయండి, ప్రతి ఓటును పరిగణనలోకి తీసుకోండి అంటూ చెప్పుకొచ్చారు. అంతకు ముందు సోషల్ మీడియా వేదిక గా మంచు విష్ణు ప్రకాష్ రాజ్ తో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.

సంబంధిత సమాచారం :