నన్ను సైడ్ అయిపోమని చిరంజీవి గారు చెప్పారు – మంచు విష్ణు

Published on Oct 11, 2021 9:10 pm IST


ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మా ఎన్నికల్లో ఊహించని రీతిలో పోలింగ్ జరిగింది. చాలా ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంచు విష్ణు మరియు ప్రకాష్ రాజ్ ల కి జరిగిన పోటీ లో మంచు విష్ణు ప్రెసిడెంట్ గా గెలుపొందారు. దాదాపు 100 ఓట్ల తేడాతో మంచు విష్ణు గెలవడం విశేషం. అయితే అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు సర్వత్రా హాట్ టాపిక్ గా మారాయి.

ఈ మేరకు తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన మంచు విష్ణు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తనను సైడ్ అయిపోమని చిరంజీవి గారు చెప్పారు అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక తనకు చరణ్ ఓటు వేశారు అనేది అబద్దం అని అన్నారు. వాళ్ళ నాన్న చెప్పినట్టు గానే ప్రకాష్ రాజ్ కి ఓటు వేసి ఉంటారు అని అన్నారు.

అంతేకాక జూనియర్ ఎన్టీఆర్ ఓటు వేయకపోవడం ఆయన పర్సనల్ అంటూ చెప్పుకొచ్చారు. కానీ తనకు ఫస్ట్ ఫోన్ కాల్ తారక్ నుండే వచ్చింది అని తెలిపారు. తన తమ్ముడు తారక్ సపోర్ట్ తనకు ఎప్పుడూ ఉంటుంది అని తెలిపారు.

సంబంధిత సమాచారం :