వారి రాజీనామా లు నాకు ఇంకా అందలేదు – మంచు విష్ణు

Published on Oct 18, 2021 1:16 pm IST

కొత్తగా ఎన్నికైన మా అధ్యక్షుడు మంచు విష్ణు మరియు అతని ప్యానెల్ సభ్యులు సోమవారం నాడు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం మీడియా తో మాట్లాడటం జరిగింది. అయితే సభ్యుల తో పాటుగా మంచు విష్ణు తండ్రి, ప్రముఖ నటుడు మోహన్ బాబు మరియు మంచు లక్ష్మి లు సైతం రావడం జరిగింది.

మీడియా తో మాట్లాడిన మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామా లేఖలు ఇంకా తనకు అందలేదు అని అన్నారు. వారు రాజీనామా ల గురించి మీడియా ద్వారా మాత్రమే తెలుసు కున్నాను, కానీ వారి లేఖలు నాకు ఇంకా అందలేదు అంటూ చెప్పుకొచ్చారు. రాజీనామా లేఖలు అందితే కాల్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చారు. రాజీనామాల వ్యవహారం తో టాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నాయి. మంచు విష్ణు తో పాటుగా ఎన్నికైన శివ బాలాజీ, గౌతమ్ రాజు, కరాటే కళ్యాణి, పూజిత, జయవాణి, మాణిక్ మరియు శ్రీనివాసులు శ్రీవారిని దర్శించుకున్నారు.

సంబంధిత సమాచారం :

More