ఐకానిక్ స్టిల్ ను రీ క్రియేట్ చేసిన మంచు విష్ణు – జెనీలియా!

Published on May 22, 2022 11:00 pm IST

మంచు విష్ణు హీరోగా, జెనీలియా హీరోయిన్ గా తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఢీ. ఈ చిత్రం థియేట్రికల్ విడుదల ను పూర్తి చేసుకొని 15 ఏళ్లు అవుతుంది.

తాజాగా మంచు విష్ణు మరియు జెనీలియా ఒక జిమ్ లో కలుసుకున్నారు. ఢీ చిత్రం లోని ఐకానిక్ స్టిల్ ను మళ్ళీ రీ క్రియేట్ చేసారు వీరిద్దరూ. ఈ ఫోటో ను మంచు విష్ణు సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇదే ఫోటో ను జెనీలియా సైతం ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేయడం జరిగింది. మా అధ్యక్షుడు గా కొనసాగుతున్న మంచు విష్ణు, ఇషాన్ సూర్య దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో పాయల్ రాజ్ పుత్ మరియు సన్ని లియోన్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :