ఒకే ఫ్రేమ్ లో మంచు విష్ణు – ప్రకాష్ రాజ్…వైరల్ అవుతోన్న ఫోటో!

Published on Jun 23, 2022 12:01 pm IST

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడు గా పేరు తెచ్చుకున్న నటుడు ప్రకాష్ రాజ్ మరియు మంచు ఫ్యామిలీ కు చెందిన మంచు విష్ణు ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. వీరిద్దరూ కూడా మా అధ్యక్ష పదవికి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రస్తుతం మంచు విష్ణు మా అధ్యక్ష పదవికి కొనసాగుతున్నారు.

వీరిద్దరూ కూడా విశ్వక్ సేన్ కొత్త చిత్రం లాంఛ్ కి రావడం విశేషం. విశ్వక్ సేన్ ప్రస్తుతం అశోక వనంలో అర్జున కళ్యాణం చిత్రం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. వరుస క్రేజీ ప్రాజెక్ట్ లను అనౌన్స్ చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయాడు. అయితే ఈ కొత్త చిత్రం లాంఛ్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రావడం విశేషం. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :