అఖండ చిత్రానికి బెస్ట్ విషెస్ తెలిపిన మంచు విష్ణు

Published on Dec 2, 2021 10:47 am IST

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలి అంటూ అభిమానులు, సినీ పరిశ్రమ కి చెందిన పలువురు ప్రముఖులు కోరుకుంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక గా నటుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు.

అఖండ చిత్రానికి బెస్ట్ విషెస్ అంటూ చెప్పుకొచ్చారు. బిగ్ స్క్రీన్ పై అఖండ చిత్రం ను చూసేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. అంతేకాక బాలా అన్న బెస్ట్ మూమెంట్ ఇది అంటూ మంచు విష్ణు తెలిపారు. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణం లో వచ్చిన ఈ చిత్రానికి సంగీతం థమన్ అందించారు. ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించగా, శ్రీకాంత్, జగపతి బాబు లు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :