అల్లు అర్జున్‌ అంటే అసూయ కలిగింది – మంచు విష్ణు

Published on Oct 20, 2021 2:10 am IST


ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌పై తాజాగా మా అధ్యక్షుడు హీరో మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానల్‌తో మాట్లాడిన మంచు విష్ణు ‘మా’ ఎన్నికలతో పాటు మెగా కుటుంబంతో ఉన్న రిలేషన్‌షిప్‌పై కూడా స్పందించాడు. ఈ క్రమంలో బన్నీ తనకు మంచి మిత్రుడని, తరచూ ఇద్దరం చాటింగ్ చేసుకుటామని అన్నారు.

అయితే అల్లు అర్జున్ అంటే అసూయ కలిగిందని, అదే సమయంలో బన్నీని చూసి గర్వంగా కూడా ఫీల్‌ అవుతున్నానని అన్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న “పుష్ప” సినిమా త్వరలో విడుదల కాబోతోంది. అయితే అదే సమయానికి బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్ ఖాన్‌ ‘లాల్‌ సింగ్‌ చద్ధా’ కూడా విడుదలకు సిద్దమైంది. అయితే బాలీవుడ్‌కు చెందిన పలు మ్యాగజైన్స్‌, వార్త పత్రికలు హీరో అల్లు అర్జున్‌, అమీర్ ఖాన్‌కు పోటీ ఇవ్వబోతున్నాడని రాశాయి. అది చూసి బన్నీ అంటే అసూయ కలిగిందని, కానీ తనని చూసి నిజంగా గర్వపడ్డానని అన్నారు.

సంబంధిత సమాచారం :

More