విష్ణు పుట్టినరోజు సందర్భంగా ‘ఓటర్’ ఫస్ట్ లుక్ !
Published on Nov 20, 2017 6:35 pm IST

మంచు విష్ణు హీరోగా సురభి హీరొయిన్ గా గజ్జెల కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు-తమిళ బైలింగువల్ సినిమా ‘ఓటర్’. ‘హీరో ఆఫ్ ది నేషన్’ అనేది ట్యాగ్ లైన్. దాదాపు షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

నిర్మాత సుధీర్ కుమార్ పూదోట (జాన్) రామా రీల్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటివల ఐర్ ల్యాండ్ లో రెండు పాటల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కు తమన్ సంగీతం అందిస్తున్నారు. విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23 న ఓటర్ ఫస్ట్ లుక్ విడుదల కానుంది. ఈ సినిమా విజయవంతం అయ్యి హీరో మంచు విష్ణు కు డైరెక్టర్ కార్తీక్ రెడ్డి మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుందా,

 
Like us on Facebook