గాలి నాగేశ్వరరావు సరసన పాయల్, సన్నీలియోన్ !

Published on Mar 7, 2022 4:37 pm IST

మంచు విష్ణు హీరోగా రాబోతున్న కొత్త సినిమా ‘గాలి నాగేశ్వరరావు’. కాగా విష్ణు లీడ్ రోల్ లో రాబోతున్న ఈ చిత్రంలో స్వాతి పాత్రలో పాయల్ రాజ్ ఫుత్, రేణుక గా సన్నీలియోన్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ ఇద్దరూ సినిమాలో భాగమైన విషయాన్ని చిత్రం యూనిట్ సోమవారం (7.3.2022) అధికారికంగా ప్రకటించింది. ‘గాలి నాగేశ్వరరావు’ క్యారెక్టర్ ని కార్టూన్ రూపంలో విడుదల చేసినట్టే… పాయల్, సన్నీలియోన్ గెటప్ లను కూడా కార్టూన్ రూపంలో రిలీజ్ చేయడం జరిగింది.

కాగా డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో విష్ణు మంచు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కథ, స్ర్కీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు కెమెరామ్యాన్ గా భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు. జి.నాగేశ్వరరెడ్డి మూల కథ అందించారు.

సంబంధిత సమాచారం :