పవన్, నేను చాలా విషయాలు చర్చించాము – మంచు విష్ణు

Published on Oct 19, 2021 8:41 am IST

కొద్ది రోజుల క్రితం మంచు విష్ణు బండారు దత్తాత్రేయ అలాయ్ బలాయ్ కి సంబంధించిన పవన్ కళ్యాణ్ వీడియో ను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియా లో షేర్ చేయడం తో అభిమానులు అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేయడం జరిగింది. ఈ వీడియో ద్వారా మంచు విష్ణు ను పవన్ కళ్యాణ్ అభిమానులు ట్రొల్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ మంచు విష్ణు ను పట్టించుకోలేదు అంటూ కొందరు చెప్పుకొచ్చారు.

తాజాగా మంచు విష్ణు తన పై వస్తున్న ట్రోల్స్ పై స్పందించడం జరిగింది. ప్రోటోకాల్ కారణంగా పవన్ కళ్యాణ్ తో వేదిక పై మాట్లాడలేదు అని అన్నారు. మేము వేదిక పై ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఉండటాన్ని మాత్రమే ప్రజలు చూశారు, కానీ మేము ఒకరినొకరు కలుసుకున్నాం, చాలా విషయాలు చర్చించామని తెలిపారు. మంచు మరియు మెగా ఫ్యామిలీ లు కుటుంబ స్నేహితులు అంటూ చెప్పుకొచ్చారు. మా ఎన్నికల తర్వాత మోహన్ బాబు కి మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేసి, అన్ని విభేదాలను పరిష్కరించడం జరిగింది అని, వారు ఏమి చర్చించారు అనేది తెలియదు, ఆ విషయం లో మీడియా నాన్న ను అడగవచ్చు అంటూ మంచు విష్ణు అన్నారు.

సంబంధిత సమాచారం :