ఇంట్రెస్టింగ్ గా అనౌన్స్ అయ్యిన మంచు విష్ణు నెక్స్ట్ సినిమా టైటిల్.!

Published on Jun 10, 2022 1:55 pm IST

టాలీవుడ్ ప్రముఖ హీరో అలాగే ప్రస్తుత మా(మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్) ప్రెసిడెంట్ అయినటువంటి మంచు విష్ణు హీరోగా ప్రస్తుతం దర్శకుడు శ్రీను వైట్లతో ఢీ డబుల్ డోస్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత హీరోగా మరో ఇంట్రెస్టింగ్ సినిమా చేస్తున్నట్టుగా ఇప్పుడు అనౌన్స్ అయ్యింది. బాలీవుడ్ ప్రముఖ నటి సన్నీ లియోన్ అలాగే యంగ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని ఈషన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నాడు.

అయితే ఈ సినిమాపై ఇపుడు మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్సమెంట్ ని అందించారు. విష్ణు, సునీల్, సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు అలాగే రచయితా కోనా వెంకట్ అలాగే సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ లు కలిపి టైటిల్ రివీల్ పై ఇంట్రెస్టింగ్ వీడియో చేశారు.

మరి దీనితో ఈ సినిమాకి క్రేజీ టైటిల్ “జిన్నా” అని అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమా ఇంకెంత కేజ్రీగా ఉంటుందో చూడాలి. ఆల్రెడీ అయితే చాలా మేర షూటింగ్ ని ఈ చిత్రం కంప్లీట్ చేసుకోగా ఎవిఎ ఎంటర్టైన్మెంట్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :