ఇదేంటి అని అడిగినందుకు, బ్రహ్మానందం గారు.. – మంచు విష్ణు

Published on Oct 10, 2021 6:09 pm IST

‘మా’ ఎన్నికలు అనే సినిమా ఫస్ట్ హాఫ్ ముగిసింది. ఇక ఫస్ట్ హాఫ్ లో బాలయ్య, చిరు, పవన్ లాంటి స్టార్ హీరోలు ఎంట్రీ ఇచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే సీనియర్ హాస్య నటుడు బ్రహ్మానందం కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే మంచు విష్ణు తన ప్రత్యర్థి ప్రకాష్ రాజ్‌తో సరదగా మీడియాతో మాట్లాడుతూ.. ‘నాకు ప్రకాష్ రాజ్‌ గారికి అర్థం కాని విషయం ఏంటంటే.. ఓటు వేయడానికి బ్రహ్మానందం గారు వచ్చారు.

అందరినీ తోసి, బ్రహ్మానందం బ్యాలెట్ పేపర్లు తీసుకెళ్లి ఎవరికో గుద్దేశారు. అయితే, బ్రహ్మానందం గారు ఓటు ప్రకాష్ రాజ్‌ కు గుద్దారా? లేక నాకు గుద్దారా? అనేది తెలియడం లేదు. ఇదేంటి అని అడిగినందుకు, బ్రహ్మానందం గారు గట్టి గట్టిగా అరుస్తున్నారు’ అంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. మొత్తానికి మా ఎన్నికలు కాసేపు కౌగిలింతలతో మధ్యమధ్యలో చిన్నపాటి గొడవలతో పోలింగ్ ఆసక్తికరంగా జరిగింది.

సంబంధిత సమాచారం :