‘మా’కు సంబంధించి రేపు గుడ్‌న్యూస్ చెప్పనున్న మంచు విష్ణు..!

‘మా’కు సంబంధించి రేపు గుడ్‌న్యూస్ చెప్పనున్న మంచు విష్ణు..!

Published on Oct 21, 2021 11:06 PM IST


మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్(మా)కు ఇటీవల మంచు విష్ణు నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెన్షన్ ఫైలుపై సంతకం చేసిన మంచు విష్ణు మిగతా హామీలపై కూడా త్వరతగిన నిర్ణయాలు తీసుకోబోతున్నాడు. అయితే తాజాగా రేపు ‘మా’కు సంబంధించి గుడ్‌న్యూస్ చెప్పబోతున్నట్టు మంచు విష్ణు ప్రకటించాడు.

దీంతో మంచు విష్ణు ఎలాంటి శుభవార్త చెప్పబోతున్నాడో అని మా సభ్యులతో పాటు అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మా ఎన్నికల్లో గెలిస్తే ‘మా’కు సొంత బిల్డింగ్‌ కట్టిస్తానని ప్రకటించిన మంచు విష్ణు రేపు ఆ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ రాజీనామాలపై కూడా మంచు విష్ణు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు