అభ్యంతరకరం పై నియంత్ర‌ణ సాధ్య‌మేనా ?

అభ్యంతరకరం పై నియంత్ర‌ణ సాధ్య‌మేనా ?

Published on Oct 26, 2021 1:54 AM IST


‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీక‌రించాక మంచు విష్ణు మహిళల భద్రత, సాధికారత పై దృష్టి పెట్టారు. ముఖ్యంగా యూట్యూబ్‌ ఛానల్స్ లో పెట్టే థంబ్‌ నైల్స్‌ హద్దులు మీరుతున్నాయని విష్ణు ఆరోపించారు. నటీమణులు మన ఆడపడుచులని, వారిని గౌరవించాలని విష్ణు విజ్ఞప్తి చేస్తూనే.. ఒకవేళ హీరోయిన్లపై అభ్యంతరకర వీడియోలు పెడితే సహించమని.. అలాంటి వారి పై అలాగే అలాంటి ఛానెల్స్ పై కఠిన నిర్ణయాలు తీసుకుంటామని విష్ణు చెప్పుకొచ్చారు.

అలాగే యూట్యూబ్‌ ఛానళ్ల నియంత్రణకు మంచు విష్ణు ప్రత్యేక లీగల్‌ సెల్‌ కూడా ఏర్పాటు చేస్తున్నారు. పరిధి దాటే ఛానల్స్ ను నియంత్రించడమే తమ మెయిన్ ఎజెండా అని విష్ణు చెప్పుకొచ్చాడు. అయితే, అసలు యూట్యూబ్ ఛాన‌ళ్ల‌ పై నియంత్ర‌ణ అనేది సాధ్యమవుతుందా ? భావ వ్యక్తీకరణ స్వేచ్చ అంటూ పుకార్లు పుట్టించే వ్యక్తులను నిరోధించడం కచ్చితంగా మంచిదే.

కాకపోతే ఆచరణలో ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది ? ఇదే అసలు డౌట్. గతంలో ఇదే విషయంలో కొంతమంది కోర్టు మెట్లు కూడా ఎక్కారు. కానీ ఫ‌లితం రాలేదు. మరి ఇప్పుడైనా ఫలితం వస్తోందా ? చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు