‘మా’ సభ్యుల కోసం మంచు విష్ణు మరో కీలక అడుగు..!

Published on Nov 24, 2021 11:00 pm IST


మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)కు కొద్ది రోజుల క్రితమే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో పడ్డాడు. ఇప్పటికే’మా’లో మహిళల భద్రత, సాధికారతను పెంపొందించేందుకు ‘విమెన్‌ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ గ్రీవెన్స్‌ సెల్‌’ పేరిట ఓ కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీకి గౌరవ సలహాదారుగా ప్రముఖ సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్‌ ఉంటారని వెల్లడించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా మంచు విష్ణు మా సభ్యుల ఆరోగ్యంపై దృష్టి సారించాడు. ఏఐజీ, అపోలో, కిమ్స్, మెడికవర్, సన్ షైన్ ఆస్పత్రులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఆస్పత్రుల్లో 50 శాతం రాయితీపై ఓపీ కన్సల్టేషనల్‌తో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఉచిత అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించనున్నట్లు విష్ణు చెప్పుకొచ్చాడు. సభ్యులందరికీ దశల వారీగా ఆరోగ్య పరీక్షలు చేయిస్తామని, డిసెంబర్‌లో మెడికవర్, మార్చిలో ఏఐజీ, జూన్‌లో అపోలో, సెప్టెంబర్‌లో కిమ్స్ ఆస్పత్రిలో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపాడు.

సంబంధిత సమాచారం :

More