థాంక్యూ బాల అన్న – మంచు విష్ణు

Published on Oct 14, 2021 11:48 pm IST


మా ఎన్నికల్లో మంచు విష్ణు ప్రెసిడెంట్ గా గెలుపొందిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఎన్నికల ముందు మంచు విష్ణు పలువురు అగ్ర హీరోలను కలవడం జరిగింది. ఆ హీరోలు మంచు విష్ణు కి మద్దతుగా నిలిచారు. అందులో నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ ను మంచు విష్ణు మరియు మంచు మోహన్ బాబు లు కలవడం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ మేరకు అందుకు సంబంధించిన ఫోటోలను మంచు విష్ణు షేర్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మద్దతు తెలిపినందుకు బాలకృష్ణ కి థాంక్స్ తెలిపారు మంచు విష్ణు. బాలకృష్ణ ను కలిసి కృతజ్ఞతలు చెప్పడం జరిగిందని, అంతేకాక మా సభ్యులందరిని కూడా కలపని చెప్పినట్లు తెలిపారు. ప్రస్తుతం తన అజెండా అదే అంటూ చెప్పుకొచ్చారు మంచు విష్ణు. మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం :