మంచు విష్ణు వైరల్ ట్వీట్..ఎవరో గెస్ చెయ్యమంటూ

Published on Oct 17, 2021 12:00 pm IST

తాజాగా జరిగినటువంటి మా(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో మంచు విష్ణు విజయ కేతనం ఎగుర వేసిన సంగతి తెలిసిందే. నటుడు ప్రకాష్ రాజ్ ప్యానల్ కి అలాగే విష్ణు ప్యానల్ కి జరిగినటువంటి రసవత్తర ఎన్నికల్లో విష్ణు గెలుపొంది మొన్న ప్రెసిడెంట్ గా ఛార్జ్ తీస్కొని నిన్న పలువురు ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం కూడా చేశారు.

అయితే ఇప్పుడు తాజాగా తన సోషల్ మీడియాలో పెట్టిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతుంది. ఒక వీడియో పెట్టి అందులో లాస్ట్ సెకండ్ లో కనిపించింది ఎవరో గెస్ట్ చెయ్యమని పెట్టాడు. అయితే ఇందులో ఉన్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నే అని చూసిన అందరికీ అర్ధం అవుతుంది.

దీనితో ఈ ట్వీట్ వెంటనే వైరల్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. మరి కొన్ని రోజులు కితమే మంచు విష్ణు సోదరుడు మంచు మనోజ్ పవన్ ని కలిసి కాస్త ఎక్కువ సమయమే చర్చలు కూడా జరిపిన సంగతి తెలిసిందే. మరి విష్ణు ఎందుకు ఈ ట్వీట్ పెట్టాడో అని పవన్ అభిమానుల్లో ఇప్పుడు డిస్కషన్ స్టార్ట్ అయ్యింది.

సంబంధిత సమాచారం :