హిట్ ఫార్ములాను మరోసారి ప్రయోగిస్తున్న మంచి విష్ణు !


‘లక్కున్నోడు’ చిత్రంతో భారీ పరాజయాన్ని చవి చూసిన మంచు విష్ణు ఈసారి మాత్రం పకడ్బందీగా ప్లాన్ రెడీ చేసుకుని బరిలోకి దిగుతున్నాడు. తనకు కెరీర్లో మర్చిపోలేని ‘దేనికైనా రెడీ, ఈడో రకం ఆడో రకం’ వంటి హిట్లిచ్చిన జి. నాగేశ్వర్ రెడ్డితోనే నెక్స్ట్ సినిమాను చేయనున్నాడు విష్ణు. ఈ చిత్రం ఈరోజు మంచు మోహన్ బాబుగారి పుట్టిన రోజు సందర్బంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ వేడుకకు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, కళాబంధు టి. సుబ్బరామిరెడ్డిలు హాజరయ్యారు.

‘ఆచారి అమెరికా యాత్ర’ అనే టైటిల్ ఫిక్స్ చేయబడ్డ ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండనుందని తెలుస్తోంది. బ్రహ్మానందం ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఎక్కువ శాతం అమెరికాలోనే షూట్ చేస్తారట. గతంలో బ్రహ్మానందం, విష్ణు కాంబినేషన్లో వచ్చిన ‘ఢీ’ చిత్రం ఘన విజయం సాధించడంతో ఈ చిత్రంపై కూడా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో హీరోయిన్ , ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.