“మంగళవారం” రెండు రోజుల వసూళ్లు ఇవే!

Published on Nov 19, 2023 9:37 pm IST

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మంగళవారం. నవంబర్ 17, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది. రెండు రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 8.49 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది.

పాయల్ రాజ్ పుత్, నందిత శ్వేత, దివ్య పిళ్ళై, అజ్మల్ అమీర్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్, శ్రావణ్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం కి కాంతారా ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతాన్ని అందించారు. ముద్ర మీడియా వర్క్స్ మరియు ఏ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లపై స్వాతి రెడ్డి, సురేష్ వర్మ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :