‘హుషారు పిట్టలు’ నుంచి మంగ్లీ పాడిన ‘టోంగా టోంగా’ సాంగ్ విడుదల!

అన్షు, వాసవి గణేషన్‌ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘హుషారు పిట్టలు’ చిత్రం నుంచి తొలి సాంగ్ విడుదలైంది. ప్రముఖ సింగర్ మంగ్లీ ఆలపించిన ‘టోంగా.. టోంగా’ అనే ఈ హుషారైన గీతాన్ని బుధవారం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిక్షు దర్శకత్వం వహించారు. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియోస్ సమర్పణలో రూపొందిన ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఫిలింస్ సంస్థలు విడుదల చేస్తున్నాయి.

ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్‌పై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందన వచ్చింది. ఈ నెగెటివ్ కామెంట్స్‌పై దర్శకుడు బిక్షు, నిర్మాత వెంకట్ యాదవ్ స్పందిస్తూ, టీజర్ చూసి కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, కానీ సినిమా విడుదలయ్యాక అందరికీ అసలు కథ కనెక్ట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కంటెంట్‌పై నమ్మకంతోనే సురేష్ బాబు, బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రానికి మద్దతుగా నిలిచారని మేకర్స్ తెలిపారు.

చరణ్ అర్జున్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌.చిరంజన్‌ సాహిత్యాన్ని సమకూర్చారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

Exit mobile version