మణిరత్నం దర్శకత్వంలో మెగా పవర్ స్టార్

ram-charan-interview
దక్షిణాది సినీ పరిశ్రమలో టాప్ డైరెక్టర్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు ‘మణిరత్నం’. ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకురలకందించిన ఈయన దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. ప్రస్తుతమున్న యంగ్ హీరోల్లో కూడా చాలా మంది ఆయనతో సినిమా చేయాలని ఆరాటపడుతుంటారు. అలాంటి గొప్ప అవకాశం ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు దక్కిందని తెలుస్తోంది. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు మణిరత్నం, చరణ్ తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట.

ఈ సినిమా పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండనుందని తెలుస్తోంది. అలాగే ఇందులో అల్లు అర్జున్ నటిస్తాడని, ఈ ప్రాజెక్ట్ దాదాపు కన్ఫర్మ్ అయినట్టేనని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయంపై మణిరత్నం నుండిగాని, మెగా క్యాంపు నుండిగాని ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం అందలేదు. ఇకపోతే చెర్రీ, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న ‘ధృవ’ చిత్రం డిసెంబర్ నెలలో విడుదల కానుంది.