సెర్బియా వెళ్ళనున్న మణిరత్నం..!
Published on Nov 14, 2016 3:31 pm IST

mani-ratnam
‘ఓకే బంగారం’ సినిమాతో దర్శకుడిగా తన స్థాయేంటో మరోసారి నిరూపించుకున్న లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తాజాగా ‘కాట్రువెళియదియై’ అనే సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. కార్తీ, అదితిరావు హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తెలుగులో ‘డ్యూయేట్’ పేరుతో విడుదల చేయనున్నారు. యుద్ధ విమాన పైలెట్ ప్రేమకథగా ప్రచారం పొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన ఒక పాటను, కొన్ని ఫైట్ సీన్లను మణిరత్నం కశ్మీర్‌లో చిత్రీకరించాలని ప్లాన్ చేశారు.

కాగా అక్కడ అనుమతి లభించకపోవడంతో తాజాగా ఆయన ఈ పోర్షన్‌ను సెర్బియాలో షూట్ చేసేందుకు వెళుతున్నారట. తన ఇన్నేళ్ళ కెరీర్‌లో ఎక్కువగా ఇండియాలోనే షూటింగ్ చేస్తూ ఉండే మణిరత్నం, ఇలా ‘డ్యూయేట్’ కోసం సెర్బియా వెళ్ళనుండడం విశేషంగా చెప్పుకోవాలి. మద్రాస్ టాకీస్ పతాకంపై మణిరత్నం స్వయంగా నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది.

 
Like us on Facebook