రామ్ ‘హైపర్‌’కు మణిశర్మ తోడయ్యాడు..!
Published on Sep 27, 2016 4:03 pm IST

mani-sharma
‘నేను శైలజ’తో సూపర్ హిట్ కొట్టిన రామ్, తాజాగా ‘హైపర్’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో మెప్పించేందుకు సిద్ధమైపోయారు. దసరా సీజన్‌కు మంచి క్రేజ్ ఉన్న సినిమాల్లో ఒకటిగా ప్రచారం పొందుతూ వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 30న విడుదలకు పక్కాగా సిద్ధమవుతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా అన్నివిధాలా మంచి ఆసక్తి రేకెత్తించగా, తాజాగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఈ సినిమాకు పనిచేయడం మరింత ఆసక్తి కలిగిస్తోంది.

తెలుగులో అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో మాస్టర్ అనిపించుకున్న మణిశర్మ హైపర్‌కు పనిచేయడం ఆనందంగా ఉందని హీరో రామ్ అన్నారు. రామ్‌కు ‘కందిరీగ’ లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్‌గా నటించారు. 14 రీల్స్ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మించిన సినిమాకు గిబ్రాన్ సంగీతం సమకూర్చారు. తండ్రి అంటే విపరీతమైన ఇష్టం ఉండే ఓ ఆసక్తికర పాత్రలో రామ్ ఇందులో కనిపించనున్నారు.

 
Like us on Facebook