మనసు విప్పి మాట్లాడిన మణిరత్నం !
Published on Mar 20, 2017 6:00 pm IST


దర్శకుడు మణిరత్నం.. చేతల్లో తప్ప మాటల్లో ఎప్పుడూ సౌండ్ ఉండదు. మాటలు అవసరమైన చోట కూడా చిరునవ్వుతోనే సమాధానం చెప్పే అయన తొలిసారి ఈరోజు కాస్త మనసు విప్పి మాట్లాడారు. ఉదయం చెన్నైలో జరిగిన ‘కాట్రువెళియిదై’ ఆడియో వేడుకలో ఏఆర్. రెహమాన్ ను ఉద్దేశించి తన అనుభవాల్ని పంచుకున్నాను. ‘ రెహమాన్ తో నాది 25 ఏళ్ల ప్రయాణం. కానీ ఇప్పటికీ నిన్ననే కలిసినట్టు ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూనే కన్పిస్తారు.

ఆయన ప్రతి కొత్త సినిమాకి ఒక కొత్త దారిని వెతుక్కుంటారు. ప్రతి సినిమాని మొదటి సినిమాలానే భావిస్తారు. ఒక్కోసారి ఆయన మనం అడిగింది ఇవ్వరు. ఒకసారి నేను ‘బొంబాయి’ సినిమా పాటకి కంపొజిషన్ కావాలని అడిగితే ఆయన థీమ్ ట్రాక్ ఇచ్చారు. అదేంటి సర్ రేపటికి షూటింగ్ కోసం పాట కావలి అన్నాను. కానీ ఒక్కసారి ఆ థీమ్ విన్నాక నేను అంతా మర్చిపోయాను. ఇంకా నన్ను ఇంకొన్నాళ్ళు భరించాలి’ అన్నారు.

అలాగే ఈ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నైపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథని, షూటింగ్ సమయంలో ఎంతోమంది సైనికుల్ని, ఆర్మీ అధికారుల్ని కలిశామని, వారు దేశాన్ని కాపాడటం కోసం విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నారని అన్నారు. ఇకపోతే కార్తీ,అదితిరావ్ హైదరి జంటగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 17న రిలీజ్ కానుంది.

 
Like us on Facebook